కవిత చేపట్టిన పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు : మహేశ్ బిగాల
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా భారతీయుల మద్దతును కూడగడతామని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. కవిత పోరాటానికి తాము సంపూర్ణ మద్దతునిస్తున్నామని, విదేశాల్లో ఉన్న ఎన్నారైలను సంఘటితం చేస్తామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా తొలుత ఆస్ట్రేలియాలో ప్రచారాన్ని ప్రారంభించామని తెలిపారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన ఘనత కవితదేనని, అదే స్ఫూర్తితో మహిళా రిజర్వేషన్ కోసం దేశవ్యాప్తంగా మహిళలను ఐక్యం చేసి బిల్లును సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.













