పవన్ కల్యాణ్ మద్దతు కోరిన లండన్ మేయర్ అభ్యర్థి
లండన్ మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త తరుణ్ గులాటీ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మద్దతు కోరారు. ఆయన హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్‌ను కలిశారు. తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో పవన్ అభిమానులు, జనసైనికులు గణనీయంగా ఉన్నారని తరుణ్ గులాటీ జనసేన అద్యక్షుడికి వివరించారు. భారత సంతతికి చెందిన గులాటీ లండన్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయడం సంతోషకరం. అభిమానులు, జనసేన శ్రేణులతో పాటు తెలుగువారు, భారతీయులు ఆయన విజయానికి కృషి చేయాలి అని పవన్ కోరారు.













