సీఎం కేసీఆర్ కు అరుదైన గౌరవం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు పుట్టినరోజు సందర్భంగా అరుదైన గౌరవం దక్కింది. పాతబస్తీకి చెందిన న్యాయశాస్త్ర విద్యార్థిని, సూక్ష్మ కళాకారిణి రామగిరి స్వారిక తన సూక్ష్మ కళతో పలువురు దేవతమూర్తులు, రాజకీయ నాయకుల చిత్రాలను వివిధ సూక్ష్మ వస్తువులపై వేసి పలువురి మన్ననలు పొందుతోంది. గౌలిపురా అంబికానగర్ ప్రాంతానికి చెందిన రామగిరి శ్రీనివాస్, శ్రీలత కూతురు రామగిరి స్వారిక 2018లో ఎంబీఏ పూర్తి చేసింది. ఈ క్రమంలో ముఖమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా స్వారిక చింతగింజ, పాలపై కేసీఆర్ చిత్రంలో పాటు పాలపై టీఆర్ఎస్ జెండా.. జై తెలంగాణ.. నినాదం వేసి పలువురిన ఆకట్టుకుంది. స్వారిక ఇప్పటి వరకు రెండు వేలకు పైగా మైక్రో చిత్రాలను వేసింది. ఇటీవల 4042 బియ్యం గింజలపై భగవద్గీతను రాసింది.













