హైదరాబాద్ కు స్పుత్నిక్-వి వ్యాక్సిన్

రష్యాకు చెందిన స్పుత్నిక్ -వి వ్యాక్సిన్ హైదరాబాద్‌కు చేరుకుంది. రష్యా నుంచి ప్రత్యేక చార్డర్డ్ విమానంలో ఈ టీకాలు చేరుకున్నాయి. 56.6 టన్నుల స్పుత్నిక్ వ్యాక్సిన్లు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కార్గోలో దిగుమతి అయ్యింది. 90 నిమిషాల్లోనే ఈ దిగుమతి ప్రక్రియ మొత్తం పూర్తైంది. మూడో విడతలో మరో 27.9 లక్షల డోసులు దిగుమతి అయ్యాయి. ఇప్పటి వరకూ భారత్‌కు దిగుమతైన వ్యాక్సిన్లలో ఇదే అతి పెద్దది. దిగుమతి ప్రక్రియ పూర్తైన తర్వాత వాటిని రెడ్డీస్ ల్యాబ్‌కు తరలించారు. దీంతో ఇప్పటి వరకూ మొత్తం 30 లక్షల డోసులు భారత్‌కు చేరుకున్నట్లైంది.