మంత్రివర్గంలోకి ఆహ్వానిస్తే.. పార్టీలో చర్చించి నిర్ణయం
తెలంగాణ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళం వినిపిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇస్తామన్నారు. మంత్రివర్గంలోకి ఆహ్వానిస్తే, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్కు సీపీఐతో పొత్తు కలిసొచ్చిందన్నారు. టీడీపీ, సీపీఎం, టీజేఎస్ పార్టీలు మద్దతిచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించారని తెలిపారు. పదేళ్లుగా ఏం చేయలేని వ్యక్తి, ఇప్పుడేమీ చేస్తారనే కేసీఆర్ను ఓడించారని విమర్శించారు.













