బీజేపీ అభ్యర్థులపై కేటీఆర్ ట్వీట్..

సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చే నటులకు కొదవలేదు. అయితే అలా వచ్చిన వాళ్ళలో నిజంగా ప్రజల సమస్యల గురించి, మన దేశం గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కంగనా రనౌత్ బీజేపీ హిమాచల్ ప్రదేశ్ లోని మండే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. రీసెంట్ గా ఆమె ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర భారత తొలి ప్రధాని అని అన్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాదా దానిపై కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా బీజేపీ పార్టీపై విమర్శలు కురిపించారు. ఉత్తరాదికి చెందిన ఓ బీజేపీ ఎంపీ అభ్యర్థి నేతాజీ మన తొలి ప్రధాని అంటే.. దక్షిణాదికి చెందిన మరొక బీజేపీ నేత మహాత్మా గాంధీ మన ప్రధాని అంటారు. వీళ్ళు ఎక్కడ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారో తెలియడం లేదు.. అంటూ ఓ సెటారికల్ ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.