అరుణా మిల్లర్‌కు కంగ్రాట్స్ చెప్పిన మంత్రి కేటీఆర్
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన అరునా మిల్లర్ మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎంపికై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బగా అరుణా మిల్లర్‌కు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కంగ్రాట్స్ చెప్పారు. హైదరాబాద్‌లో పుట్టి, అమెరికాలో గొప్ప స్థాయికి ఎదగడాన్ని కేటీఆర్ ప్రశంసించారు. భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికవడం చరిత్రలో ఇదే తొలిసారి. ప్రస్తుతం 58వ పడిలో ఉన్న అరుణా మిల్లర్ హైదరాబాద్‌లో జన్మించారు. అరుణకు ఏడేండ్ల వయసున్నప్పుడు (1972)లో ఆమె కుటుంబం అమెరికాకు వలసవెళ్లి అక్కడే స్థిరపడిరది.













