బీఆర్ఎస్ నేతలు ఇకపై అలా మాట్లాడొద్దు : కేటీఆర్
పాలన మీద దృష్టి పార్టీని పట్టించుకోలేదని, అందుకు తనదే బాధ్యత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కేంద్రంగా పార్టీని నడపడం సరికాదన్నారు. ఎన్నికల్లో ప్రజలు తప్పుచేశారని అనడం సరైది కాదు. బీఆర్ఎస్ నేతలు ఇకపై అలా మాట్లాడొద్దు. రెండు సార్లు మనల్ని గెలిపించింది కూడా ఈ ప్రజలేనని గుర్తు పెట్టుకోవాలి. పార్టీని పూర్తిగా తిరస్కరించలేదు. 14 చోట్ల అతి తక్కువ తేడాతో మన అభ్యర్థులు ఓడిపోయారు. పదేళ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదు. దళితబంధు కొందరికే రావడంతో మిగతావారు వ్యతిరేకమయ్యారు. ఈ పథకంపై ఇతర కులాల్లోనూ వ్యతిరేకత కనిపించింది. భూస్వాములకు రైతుబంధు ఇవ్వడాన్ని చిన్న రైతులు వ్యతిరేకించారు. ప్రజా వ్యతిరేకతను సరిగ్గా అంచనా వేయలేకపోయాం. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే అని అన్నారు.













