మంత్రి కేటీఆర్ మరో ఘనత … వరల్డ్ టాప్-30 జాబితాలో
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు మరో ఘనతను సాధించారు. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ప్రభావశీలుర జాబితాలో ఆయనకు చోటు దక్కింది. టాప్-30 జాబితాలో 12వ స్థానంలో కేటీఆర్ నిలిచారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు సందర్భంగా సామాజిక మాద్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రభావశీలత చూపుతున్న ప్రముఖుల జాబితాను కోర్ అనలెటిక్స్ విడుదల చేసింది. టాప్-30 సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ల జాబితాలో మంత్రి కేటీఆర్ 12వ స్థానంలో నిలువడం గమనార్హం. భారత్ నుంచి ఇద్దరు యువనేతలకు మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం. అందులో ఒకరు కేటీఆర్ కాగా, మరొకరు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా. రాఘవ్ చద్దా 23వ స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరి లోనూ మంత్రి కేటీఆరే ముందంజలో ఉండటం విశేషం. పైగా కేటీఆర్కు 38,34, 71 మంది ఫాలోవర్స్ ఉన్నట్టుగా కోర్ అనలెటిక్స్ పేర్కొన్నది.













