ఇతర రాష్ట్రాలకు మించి ఫ్రాన్స్ సంస్థలకు.. ఫ్రెంచ్ సెనేట్ లో మంత్రి కేటీఆర్
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్సుకు చెందిన చిన్న, మధ్య తరహా సంస్థలు ముందుకొస్తే వారికోసం ఇతర రాష్ట్రాలకు మించిన ప్రత్యేక రాయితీతో పాటు, ప్రత్యేకంగా పారిశ్రామిక సముదాయాన్ని (క్లస్టర్) అభివృద్ది చేసేందుకు సుముఖంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులతో కలిసి ఫ్రాన్స్ పర్యటలో ఉన్న మంత్రి కేటీఆర్ ప్యార్సిలోని ఫ్రెంచ్ సెనేట్ వేదికగా జరిగిన యాంబిషన్ ఇండియా 2021 బిజినెస్ ఫోరంలో పాల్గొన్నారు. కొవిడ్ అనంతర కాలంలో ఇండో`ఫ్రాన్స్ సంబంధాలు, భవిష్యత్తు కార్యాచరణ అంశంపై ప్రసంగించారు. అనుకూల విధానాలు రూపొందించి పారిశ్రామిక ప్రగతిలో భారత్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు.
ఏడేళ్లుగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ పురోగమిస్తున్న తీరును వివరిస్తూ పెట్టుబడులు, పెట్టాల్సిందిగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. భూముల కేటాయింపు, అనుమతులు, శిక్షణ పొందిన మానవ వనరులను అందించడంలో సాయం, వనరుల సేకరణ విధానాల్లో భారత్లోని రాష్ట్రాలు గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాలు, ఇక్కడి పారిశ్రామిక అనుకూల విధానాలు, ఇక్కడి పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను ప్రస్తావించారు. భారత్లో ఇతర రాష్ట్రాలు ఇస్తున్న మిహాయింపులు, రాయితీలను తమతో ప్రస్తావిస్తే అంతకుమించి తామూ అవకాశాలు కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.













