అమెరికా వర్సిటీతో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఒప్పందం
భారతదేశంలో సుప్రసిద్ద ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఒకటైన కేఎల్ డీమ్డ్ టూ బి యూనివర్సిటీ తన కమ్యూనిటీ సర్వీస్ ప్రోగ్రామ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ కమ్యూనిటీ సర్వీసెస్ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని తమ శాఖలో అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీల్లో ఒకటైన పురుడ్య యూనివర్సిటీతో భాగస్వామ్యం చేసుకొని ప్రారంభించింది. అనంతరం ఈ రెండు యూనివర్సిటీల మధ్య అవగాహన ఒప్పందాలపై కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్. కోటేశ్వర్రావు, ప్రొఫెసర్ విలియమ్ ఒవాకెస్లతో ఒప్పందాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిషోర్‌బాబు, డాక్టర్ ఎన్. సైదిరెడ్డి, కాంతారెడ్డి, ఎం. గౌతం, డాక్టర్ సందీప్, తదితరులు పాల్గొన్నారు.













