కాకతీయుల శిల్ప కళా వైభవం అద్భుతం : కిషన్ రెడ్డి

వేయిస్తంభాల గుడిని కట్టేందుకు 72 సంవత్సరాలు పట్టిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో పునర్నిర్మించిన కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. యాగశాలలో శాంతిహోమం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మధ్యయుగంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాలను ధ్వంసం చేశారు. తుగ్లక్ సైన్యం రామప్ప గుడి నుంచి వరంగల్ కోట వరకు అన్నింటినీ దెబ్బతీసిందని తెలిపారు. తాజాగా పునర్నిర్మాణం చేసిన వేయి స్తంభాల గుడి కల్యాణ మండపంలో 132 స్తంభాలు ఏర్పాటు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. కాకతీయుల శిల్ప కళా వైభవం అద్భుతమని కొనియాడారు. ప్రాచీక కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదన్నారు.