వారి డిమాండ్లను పరిష్కరించాలి : కిషన్ రెడ్డి
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కార్మికుల పొట్టకొట్టకుండా సానుకూల దృక్పథంతో వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితాలను ఉద్దేశిస్తూ ఇల్లలకగానే పండగ కాదని.. ముందుంది మొసళ్ల పండగని వ్యాఖ్యానించారు. కార్మికులను సస్పెండ్ చేయాలని ఏ చట్టమూ చెప్పలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారమే చేశామని తమపై నేరాన్ని నెట్టేసే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసిని అభివృద్ధి బాటలో నడిపించాలని కోరుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపట్ల రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించుకోవాలన్నారు.













