ఈడీ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ లేదు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా విమర్శలు చేశారు. యాదాద్రి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. బీసీ బంధు ఇస్తారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ప్రకటిస్తారా అని నిలదీవారు. నెలలో సగం రోజులు సీఎం కేసీఆర్ ఫాం హౌజ్లో ఉంటారని మిగతా సగం రోజులు మోదీని తిట్టడానికే సరిపోతుందని దుయ్యబట్టారు. తెలంగాణ పాలిట సీఎం కేసీఆర్ శాపంగా మారారు. దేశాన్ని ఉద్దరించడం కాదు, ముందు రాష్ట్ర సమస్యలపై స్పందించాలి. ఈడీ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ లేదన్నారు. కేజీ టు పీజీ ఏమైంది. ఏడాది తరువాత రాష్ట్రంలో మార్పు వస్తుంది. మజ్లిస్, టీఆర్ఎస్ దొంగాట అడుతున్నాయని మండిపడ్డారు.













