ఆ కేసుపై దర్యాప్తు ఎందుకు జరగడం లేదు? : కిషన్ రెడ్డి
తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్తో కలిసి పనిచేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. కాంగ్రెస్ బీ టీమ్ బీఆర్ఎస్. కాంగ్రెస్లో బీఆర్ఎస్ను విలీనం చేస్తానన్నది నిజం కాదా? రేవంత్ రెడ్డిపై ఉన్న ఓటుకు నోటు కేసు ఎందుకు తొక్కిపెట్టారు? ఆ కేసుపై దర్యాప్తు ఎందుకు జరగడం లేదు? దర్యాప్తు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పినా ఎందుకు చేయలేదు? ఎవరు ఎవర్ని కాపాడుతున్నారో రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్లు మధ్యవర్తిగా మజ్లిస్ పార్టీని పెట్టుకున్నాయి. మజ్లిస్ పార్టీని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి రాకుండా చేస్తున్నారు అని విమర్శించారు.













