వారే లేకపోతే దేశాన్ని పోషించేది ఎవరు?

బయోకాన్ పారిశ్రామిక దిగ్గజం కిరణ్ మజుందార్ -షా కరోనా టీకాపై పెట్టిన పోస్టింగు వైరల్ అవుతున్నది. ముందుగా కరోనా టీకా ఆదాయపన్ను చెల్లింపుదారులకే ఇవ్వాలి. వారు కేవలం 3 కోట్ల మంది మాత్రమే. వారే లేకపోతే దేశాన్ని పోషించేది ఎవరు? అంటూ కిరణ్ తన మనసులోని మాటను వెల్లడించారు. అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఆదాయపన్ను కట్టే మీలాంటి వాళ్లే పన్ను చెల్లింపుదారులా.. పరోక్ష పన్నులు చెల్లించేవారు ఎందరో ఉంటారు కదా అని విసుక్కున్నారు. దీంతో కిరణ్ తన ట్వీట్ ఉపసంహరించుకున్నారు. అంతేకాకుండా కరోనా కాలంలో మనకు హాస్యప్రియత్వం తగ్గిపోయిందని, నిజాంగానే నేను పన్ను చెల్లింపుదారులతే పరిమితం చేయాలని అన్నట్టు అందరూ భావించడం విడ్డూరమని ఆమె పేర్కొన్నారు.