లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ కు .. తొలి విజయం

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెలంగాణలో తొలి విజయం నమోదైంది. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి 3.5 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై ఆయన విజయం సాధించారు.