ఎన్ని యాగాలు చేసిన ఆయన పాపాలు పోవు
సీఎం కేసీఆర్ ఎన్ని యాగాలు చేసిన ఆయన పాపాలు పోవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణకు పట్టిన వాస్తుదోషం కేసీఆర్ అని ఆక్షేపించారు. అమరవీరుల ఉసురు కేసీఆర్కు తగులుతుందని మండిపడ్డారు. నాగార్జు సాగర్లో బీజేపీని ఎదుర్కోవడం కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీలో వచ్చిన ఫలితాలే నాగార్జున సాగర్లో వస్తాయని సృష్టం చేశారు. బీజేపీ అంటే కేసీఆర్కు భయం పట్టుకుందన్నారు. కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయలేదన్నారు. ఉద్యోగ, విద్యార్థి సమస్యలను పరిష్కరించాలని లేకపోతే బీజేపీ పోరాడుతుందని చెప్పారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసిన నాగార్జున సాగర్ ప్రజలు తిప్పికొడతారన్నారు. నాగార్జున సాగర్లో బీజేపీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు.













