ఆస్ట్రేలియాలో ఘనంగా ముగిసిన కేసీఆర్ కప్ టోర్నమెంట్
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ అల్కాక్ రిజర్వ్‌లోని పెవిలియన్‌లో కేసీఆర్ కప్ టోర్నమెంట్ గ్రాండ్ ఫైనల్స్ మ్యాచ్‌ను అత్యధిక జనసందోహంతో ఘనంగా జరిపారు. భారత దేశానికి చెందిన ఆస్ట్రేలియాలో స్థిరపడిన 29 రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలతో 3 వారాల పాటు ఈ టోర్నీ నిర్వహించడం జరిగిందని టోర్నమెంట్ బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు. భారతదేవానికి చెందిన అన్ని రాష్ట్రాల ఎన్నారైలు వివిధ సంఘాల నాయకులు, ప్రజల ఇందులో పాల్గొన్నారని తెలిపారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా జాతీయ పార్టీగా మారిన ముఖ్య ఉద్దేశాన్ని అందరికీ తెలియజేసేందుకు క్రికెట్‌ను సరైన వేదికగా ఎంచుకోవడం జరిగింది అన్నారు. అందులో భాగంగా కేసీఆర్ కప్ టోర్నమెంట్ నిర్వహించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సాయి రామ్ ఉప్పు, వినయ్ సన్నీ గౌడ్, సాయికృష్ణ కల్వకుంట్ల, ప్రవీణ్ లేదెళ్ల, వంగపల్లి సురేందర్ రెడ్డి, విశ్వామిత్ర మంత్రి ప్రగడ, సూర్య రావు, అశోక్, రాకేష్, అమిత్, వినోద్ కత్తుల, విజయ్ నడదూర్, సతీష్, శివ హైదరాబాద్, హరి పల్ల, కరుణాకర్ నందవరంతో పాటు వివిధ సంఘాల నాయకులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.













