ఆస్ట్రేలియాలో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ మెల్‌బోర్స్‌లో ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలో స్థిరపడిన 29 రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలతో 3 వారాల పాటు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 16, 17న గ్రాండ్ ఫైనల్స్‌ను అంగరంగా వైభవంగా జరపనున్నామన్నారు. ఇండియాకు చెందిన అన్ని రాష్ట్రాల ఎన్నారైలు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు ఇందులో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంపై విక్టోరియా స్టేట్ కన్వీనర్ సాయిరాం ఉప్పు చేసిన పవర్ ప్రెజెంటేషన్ అందరిని ఆకట్టుకుంది. ఈ ప్రారంభోత్సవ వేడుకలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు విశ్వామిత్ర, మంత్రి ప్రగడ, వినయ్ సన్నీ గౌడ్, బాలరాజు కుమ్మరి, వంగపల్లి సురేందర్ రెడ్డి, హర్షరెడ్డి, గండ్ర ప్రశాంత్ రావు, విజయ్ నడదూర్తో పాటు వివిధ సంఘాల నాయకులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.













