తమకు విగ్రహం కాదు.. రాజ్యాధికారం కావాలి
ప్రజలను మోసం చేయడానికే సీఎం కేసీఆర్ భారీ అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ మోదీతో పోటీ పడి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని ఎద్దేవా ఏశారు. తమకు విగ్రహం కాదు, రాజ్యాధికారం కావాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు అప్పులతో దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తనను చంపాలని చూస్తున్నారని, పీస్ మిషన్ను ఆపేశారని ఆయన ఆరోపించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కొనడానికి ముందుకొచ్చిన కేసీఆర్, వేలానికి పెట్టిన సింగరేణి బ్లాకులను ఎందుకు కొనలేదంటూ కేఏపాల్ ప్రశ్నించారు.













