హైకోర్టు సిజెగా జస్టిస్ చౌహాన్ ప్రమాణం
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సిజెగా జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహన్ శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ జస్టిస్ చౌహన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్, హైకోర్టు జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు. క్రిమినల్, రాజ్యాంగ వ్యవహారాలు, సివిల్ సర్వీసెస్ తదితర అంశాల్లో నిపుణుడిగా పేరు తెచ్చుకున్న జస్టిస్ చౌహాన్ రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 217 (1) ప్రకారం హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌ను సిజెగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌కు చెందిన చౌహాన్ 1959 డిసెంబర్ 24న జన్మించారు.













