తెలంగాణ వైద్యులకు శుభవార్త …
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ తెలంగాణలో జూనియర్ డాక్టర్లు (జూడాలు) చేపట్టిన సమ్మెకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. జూడాలతో చర్చలు జరిపిన తర్వాత 15 శాతం స్టైఫండ్ పెంచూతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోలో 15 శాతం స్టైఫండ్ పెంపుకు ఆమోదం తెలిపింది. పెరిగిన స్టైఫండ్ ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. ఈ క్రమంలోనే సీనియర్ రెసిడెంట్లకు వేతనాలు రూ.70,000ల నుంచి రూ.80,500 వరకు పెరగనున్నాయి. దీంతో రెసిడెంట్ డాక్టర్లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.













