అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరేది వీరే
ప్రస్తుతం అందరి చూపు బీజేపీ వైపే ఉందని బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనునన్నారని తెలిపారు. కాంగ్రెస సీనియర్ నేత దాసోజు శ్రవణ్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్రావు వంటి నాయకులూ కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. పార్టీలో వచ్చేవారంరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టే ఉద్యమకారులు ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అంతరించిపోవడంతో పాటు టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున బీజేపీలో చేరికలు ఉంటాయన్నారు.













