హైదరాబాద్ లో యూఎస్ కౌన్సుల్ జనరల్‌గా జెన్నిఫర్ లార్సన్
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ఆఫీసుకు కొత్త కౌన్సుల్ జనరల్‌గా జెన్నిఫర్ లార్సన్ నియమితులయ్యారు. గతంలో ఆమె ముంబైలోని యూఎస్ కౌన్సులేట్ జనరల్‌లో డిప్యూటీ ప్రిన్సిపల్ ఆఫీసర్‌గా చేశారు. ఇండియాకు తాత్కాలిక డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా కూడా చేశారు. హైదరాబాద్‌లోని యూఎస్ కౌన్సులేట్ జనరల్‌లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌కు రావడం అత్యంత సంతోషకరంగా ఉన్నట్లు జెన్నిఫర్ తెలిపారు.
అమెరికా, ఇండియా మధ్య బంధాన్ని పెంచే దిశగా తాను ముంబై, వాషింగ్టన్ నుంచి పనిచేసినట్లు ఆమె తెలిపారు. తెలంగాణ, ఏపీ, ఒడిశాలో తమ భాగస్వామ్యాన్ని విస్తరించే దిశగా కృషి చేయనున్నట్లు ఆమె తెలిపారు. సంయుక్త సైనిక విన్యాసాలు, వ్యాపారాలు, సంస్కృతిక సంబంధాలు, ఉన్నత విద్య లాంటి అంశాల్లో అమెరికా, హైదరాబాద్ మధ్య బంధం బలోపేతం అవుతున్నట్లు ఆమె తెలిపారు.













