కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన జెన్నిఫర్ లార్సన్
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌లో కాన్సుల్ జనరల్‌గా జెన్నిఫర్ లార్సన్ బాధ్యతలు చేపట్టారు. జోయెల్ రీఫ్మాన్ పదవీ విరమణతో ఆయన స్థానంలో అమెరికా ప్రభుత్వం జెన్నిఫర్‌ను నియమించింది. ఆమె హైదరాబాద్ చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాన్సుల్ కార్యాలయంలో అధికారులకు ఆమెకు సాదర స్వాగతం పలికారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలతో అమెరికా భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించేందుకు అవకాశం లభించినందుకు గౌరవంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. సంయుక్త సైనిక విన్యాసాలు, వ్యాపార సంబంధాలు, సాంస్కృతిక మార్పిడి, ఉన్నత విద్య తదితర అంశాలతో పాటు హైదరాబాద్‌తో అమెరికా`భారత్ సంబంధాలు మరింత విస్తృతం అవుతాయని ఆమె ఆకాంక్షించారు.













