అమెరికా కాన్సులేట్ జనరల్‌గా జెన్నిఫర్ లార్సన్
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్‌గా జెన్నిఫర్ లార్సన్ నియమితులయ్యారు. ప్రస్తుతం కాన్సుల్ జనరల్‌గా ఉన్న జోయెల్ రీఫ్‌మెన్ పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో జెన్నిఫర్ బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త సీజీగా జెన్నిఫర్ లార్సన్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపడుతారని యూఎస్ కాన్సుల్ జనరల్ వెల్లడిరచింది. ఆమె గతంలో భారతదేశంలో వివిధ హోదాల్లో పని చేశారు. భారత్ వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా, ముంబయిలోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో డిప్యూటీ ప్రిన్సిపల్ ఆఫీసర్‌గా పని చేశారు. ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలో పని చేస్తున్నారు.













