ఎమ్మెల్సీ బరిలో మాజీమంత్రి
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలుస్తామని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి సృష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆయన మీడియాతో మాట్లాడారు. తాను సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నందున నియోజకవర్గంలోని 4 జిల్లాల పరిధిలోని ప్రజలకు సుపరిచితుడినేన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు, పట్టభద్రులు, ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందన్నారు. మండలిలో బలమైన గొంతును వినిపించేందుకు ఓటర్లు తనకు అవకాశం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రకటించే అభ్యర్థి కంటే తాను ప్రజలకు ఎక్కువగా తెలిసిన వ్యక్తినని, ఎమ్మెల్సీగా గెలిచేందుకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు.













