తెలంగాణలో జనసేన పోటీ… 32 నియోజకవర్గాలకు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేసేందుకు జనసేన పార్టీ సిద్ధమవుతోంది. తెలంగాణలో పోటీ చేసేందుకు ఆ పార్టీ కార్యవర్గం ముమ్మర కసరత్తు చేస్తోంది. తెలంగాణ లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన వషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేన తెలంగాణ ఇన్ఛార్జి నేమూరి శంకర్ గౌడ్ కసరత్తు మొదలు పెట్టారు. ప్రస్తుతానికి తెలంగాణలోని 32 నియోజక వర్గాలకు కార్యనిర్వాహకులను ఎంపిక చేశారు. వీరంతా వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించిన నివేదిక అందజేస్తారని, ఆ నివేదిక ఆధారంగా ఆయా నియోజక వర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామని నేమూరి శంకర్ గౌడ్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలోనూ జనసేన పోటీ చేయనుందని అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో జరిన భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణకు చెందిన జనసేన పార్టీ నేతలు హాజరయ్యారు.













