టీఆర్ఎస్ లోకి జగ్గారెడ్డి ?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి జంప్ చేయగా, తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే, జగ్గారెడ్డి ఆ పార్టీని వీడనున్నట్టు తెలుస్తోంది. నేడో, రేపో టీఆర్ఎస్లో చేరనున్నట్టు జగ్గారెడ్డి వర్గీయుల సమాచారం. ఈ నేపథ్యంలో సంగారెడ్డిలో తన అనుచరులు, సన్నిహితులతో జగ్గారెడ్డి సమావేశమైనట్టు తెలుస్తోంది. జగ్గారెడ్డితో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనకు ఫోన్ కాల్స్ చేస్తున్నప్పటికీ, లైన్ కలవడం లేదు. జగ్గారెడ్డి ఫోన్ స్విచ్చాప్ చేసి ఉండటంతో టీఆర్ఎస్ లో ఆయన చేరతారన్న అనుమానాలకు మరింత బలం చేకూరినట్టుయింది.













