నా అవసరం కేసీఆర్ కు లేదు.. కానీ కేసీఆర్ అవసరం నాకు ఉంది
టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్పై రానున్నరోజుల్లో ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలుస్తానని తెలిపారు. అసెంబ్లీ తొలి రోజున లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా తన అవసరం ముఖ్యమంత్రికి లేదని, ముఖ్యమంత్రి అవసరం తనకు ఉన్నదన్నారు. కేసీఆర్ తన నియోజకవర్గానికి వస్తే సన్మానిస్తానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయవద్దని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించినట్టు తెలిపారు. ప్రజలు తీర్పు ఇచ్చాక ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదనే విషయం గుర్తించానని, తనను గెలిపించిన ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామినవుతానని ఆయన పేర్కొన్నారు.













