మంత్రి మల్లారెడ్డికి ఊహించని షాక్
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో సహా కాలేజీల్లో పనిచేసే వారిని కూడా విచారించారు. అయితే తాజాగా మంత్రి మల్లారెడ్డి కేసులో ఈడీకి ఐటీ అధికారులు లేఖ రాశారు. కాగా మంత్రి మల్లారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించారు. సోదాలకు సంబంధించి పూర్తి నివేదికతో ఈడీకి ఐటీ అధికారులు లేఖ పంపించారు. ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాలను ఐటీ ఈడీకి తెలిపింది. కాగా ఈ కేసులో ఈడీ దర్యాప్తు అవసరం ఉందని ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఇక మెడికల్ సీట్లు, డొనేషన్లలో అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు జరపాలని ఐటీ అదికారులను ఈడీని కోరారు.













