గవర్నర్ తమిళిసైకి లేఖ రాసిన ఉత్తమ్…. రిప్లై ఇచ్చిన గవర్నర్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గవర్నర్ తమిళిసైకి లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా దృష్ట్యా మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తే ప్రజలు కరోనా బారినపడే ప్రమాదం ఉందని ఉత్తమ్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రంగా ఉందని, ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరిస్తోందని ఆ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని, వెంటనే గవర్నర్ జోక్యం చేసుకొని, ఎన్నికలను వాయిదా వేయాలని ఉత్తమ్ ఆ లేఖలో కోరారు. ఉత్తమ్‌కు ఫోన్ చేసిన గవర్నర్ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై టీపీసీస అధ్యక్షుడు ఉత్తమ్‌కు ఫోన్ చేశారు. ఫోన్లో ఉత్తమ్‌ను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడతానని గవర్నర్ హామీ ఇచ్చారు.













