సంస్కృతి సంప్రదాయాలకు నిలయం భారత్ : యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్
భారత్ సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ అన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కేంద్రంలో నిర్వహించిన ఉగాది వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెన్నీఫర్ లార్సన్ మాట్లాడుతూ భారత్‌లో ప్రతి పండుగ సంప్రదాయాలు, పద్ధతులు, ఆరాధనను తెలియజేస్తున్నదని అన్నారు. ఎడ్లబండ్ల ప్రదర్శనను తిలకించడం ఎంతో సంతోషంగా ఉన్నదని తెలిపారు. దోమకొండ గడీకోట ట్రస్టు ఆధ్వర్యంలో రైతులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ వేడుకలో ట్రస్ట్ ప్రతినిధి కామినేని అనిల్‌కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.













