పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
పర్యాటక పెట్టుబడులకు తెలంగాణ అన్నివిధాలుగా అనుకూలంగా ఉందని పారిశ్రామికవేత్తలు ఈ రంగంపై దృష్టి సారించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన అంతర్జాతీయ పర్యాటక, సాంస్కృతిక ప్రదర్శనలలో భాగంగా పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణలోని పర్యాటక ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పారిశ్రామికంగా తెలంగాణ ప్రపంచస్థాయి గుర్తింపు పొందిందని, పర్యాటకంగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి అర్వింద్‌సింగ్, జర్మనీలో భారత రాయబారి పర్వతనేని హరీష్, తెలంగాణ పర్యాటక సంస్థ ఎండీ మనోహర్ పాల్గొన్నారు.













