ఐసీఎంఆర్ సలహాదారుగా బీపీ ఆచార్య నియామకం.. భారత్‌లో బయోటెక్ హబ్ ఏర్పాటులో ప్రత్యేక కృషి!

20ఏళ్లలో అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిన బయోమెడికల్ క్లస్టర్ జీనోమ్ వ్యాలీ. హైదరాబాద్‌లో ఏర్పాటైన దీనికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడం కృషి చేసిన వ్యక్తి బీపీ ఆచార్య. 2001లో శాన్‌డియాగోలో జరిగిన ‘బయో 2001’లో ఈ ప్రాజెక్టు ప్రజంటేషన్ ఇచ్చిన ఆయన.. కొంతమంది విదేశీ డాక్టర్ల దృష్టి ఆకర్షించారు. ఆయన అనుభవం, నాయకత్వం కారణంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) సలహాదారుగా అపాయింట్ అయ్యారు. అలాగే భారతదేశంలోనే అతిపెద్దదైన నేషనల్ యానిమల్ రీసెర్చ్ ఫెసిలిటీ (జాతీయ జంతు పరిశోధనాలయం)కి కూడా ఆయనే సలహాదారు. దేశంలోని బయోఫార్మా కంపెనీలు ప్రి-క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
హైదరాబాద్‌లో ఏర్పాటైన బయోమెడికల్ క్లస్టర్ జీనోమ్ వ్యాలీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కింది. దీనికోసం కృషి చేసిన బీపీ ఆచార్య.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) సలహాదారుగా నియమితులయ్యారు. శాన్‌డియాగోలో జరిగిన ‘బయో2001’ ఈ ఆలోచనను తొలిసారి ప్రజెంట్ చేయగా.. జర్మనీకి చెందిన డాక్టర్ క్లాజ్ ప్లేట్ వంటి వారు బీపీ ఆచార్య ఆలోచనను ప్రోత్సహించారు. అమెరికా డాక్టర్ రాబర్ట్ నైస్మిత్ వంటి వారు దీనిలో కొంత పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత ప్రాజెక్టు అభివృద్ధి కోసం తొలి దశలో పిపిపి విధానంలో బయోటెక్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికోసం నార్త్ కరోలినాలోని రీసెర్చ్ ట్రయాంగిల్ పార్కుకు వెళ్లి వివరాలు సేకరించడం జరిగింది
ప్రాజెక్టు తొలి దశలో నీటి సరఫరా, కాలుష్య నియంత్రణ, ఫైర్ స్టేషన్ అనుమతులు వంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు బీపీ ఆచార్య తెలిపారు. ఆ తర్వాత లైఫ్ సైన్సెస్ రంగానికి అనుకూలంగా ఉండటం కోసం ఈ ప్రాజెక్టును కాలుష్య రహిత జోన్‌గా ప్రకటించారని ఆయన చెప్పారు. ఆ తర్వాత 2004-05 మధ్య ఆయన్ను మెట్రోవాటర్ బోర్డు ఎండీగా ప్రభుత్వం నియమించింది. దీంతో అల్వాల్ వాటర్ రిజర్వాయర్ నుంచి 20 కిలోమీటర్ల దూరం నీటి సరఫరా చేసే ప్రాజెక్టును ఆయన పూర్తి చేశారు. ఇలా నెమ్మదిగా అన్ని సమస్యలూ పూర్తి చేసుకున్న జీనోమ్ వ్యాలీలో.. అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. స్టేజ్-2 లో భాగంగా లాల్‌గడి మలక్‌పేటలో 100 ఎకరాల భూమిని బయోటెక్ పార్క్ అభివృద్ధికి సేకరించారు. ఆ తర్వాత స్టేజ్-3 కోసం కర్కపట్లలో 150 ఎకరాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాలన్నీ యూనిట్లతో నిండిపోయి ఉన్నాయని, నాలుగో స్టేజ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆచార్య వివరించారు.
స్టేజ్-2 ఎక్స్‌టెన్షన్‌లో భాగంగా బయోలాజికల్-ఈ పేరిట ఒక వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థతో కలిసి పనిచేస్తోందట. మూడో దశలో భాగంగా ఇండియన్ ఇమ్యునోలాజికల్ మరో వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అలాగే రెండో దశలో భారత్‌లోనే అతిపెద్దదైన జాతీయ జంతు పరిశోధనాలయం (నేషనల్ యానిమల్ రీసెర్చ్ ఫెసిలిటీ) ఏర్పాటుకు ప్రభుత్వం, ఐసీఎమ్‌ఆర్ నుంచి అనుమతులు లభించాయి. దీనికోసం ప్రభుత్వం 100 ఎకరాల భూమిని కేటాయించింది. దీనికి ఆచార్యే సలహాదారుగా ఉంటారు.
ఇలా గడిచిన 20 ఏళ్లలో జీనోమ్ వ్యాలీ అంతర్జాతీయ స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్‌గా ఎదిగింది. మనదేశంలో 300పైగా బయోకంపెనీలు ఈ వ్యాలీలో ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 20వేల మందికి పైగా ఈ వ్యాలీ ఉపాధి కల్పిస్తోంది. మన దేశంలో రష్యా వ్యాక్సిన్ స్ఫుత్నిక్ ఉత్పత్తి చేయాలనుకుంటున్న సంస్థ కూడా తమ వ్యాలీ సాయం కోసం ప్రయత్నిస్తోందని ఆచార్య చెప్తున్నారు. ఇలా కరోనాపై పోరులో తమ బయోటెక్ హబ్ ముందు వరుసలో ఉండటం తమకు చాలా గర్వంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.