అమెరికాలో ఆకలితో అలమటిస్తున్న తెలంగాణ యువతి
అమెరికాలో మాస్టర్స్ చేయాలని తెలంగాణ నుంచి వెళ్లిన ఓ మహిళ షికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి తన కుమార్తెను భారత్‌కు తీసుకురావాలని అభ్యర్థిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌కు లేఖ రాశారు. హైదరాబాద్ లోని మౌలాలికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ మాస్టర్స్ చేసేందుకు 2021 ఆగస్టులో అమెరికాకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన ఆమె తరచూ తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. కానీ రెండు నెలలుగా కూతురు నుంచి ఎలాంటి స్పందన లేదు. హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన కొందరు ఆమెను గుర్తించి తల్లికి తెలియజేశారు.
ఆమె వస్తువులను ఎవరో దొంగలించారని, దీంతో చికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తోందని సమాచారం అందింంచారు. అంతేకాకుండా లులు మిన్హాజ్ మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలిపారు. తన కుమార్తెను భారత్ తీసుకురావాలని వహాజ్ ఫాతిమా కేంద్రమంత్రికి లేఖ రాశారు. నా కుమార్తె సయ్యదా లులు మిన్హాజ్ జైదీ అమెరికాకు మాస్టర్స్ చేసేందుకు వెళ్లింది. రెండు నెలలుగా ఆమె నాకు ఫోన్ చేయడం లేదు. హైదరాబాద్ నుంచి మాకు తెలిసిన కొందరు అమెరికాకు వెళ్లారు. చికాగోలో నా కుమార్తెను గుర్తించారు. ఆమె వస్తువులు చోరికి గురయ్యాయి. ఆకలితో అలమటిస్తోంది. ఆమెను భారత్‌కు తీసుకురావాలని కోరుతున్నాను అని లేఖలో పేర్కొంది.













