25 నుంచి మళ్లీ నుమాయిష్
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఈ నెల 25వ తేదీ నుంచి పున ప్రారంభం కానుంది. కరోనా తగ్గుముఖం పటడంతో మళ్లీ ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్‌ను సందర్శించవచ్చని వారు పేర్కొన్నారు. వారాంతల్లో మరో అరగంట పొడిగించి 11 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందని వారు తెలిపారు. ఇంతకు ముందు జనవరి 1న నుమాయిష్ ప్రారంభం కాగా దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ సంవత్సరం నుమాయిష్‌ను రద్దు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎగ్జిబిషన్ సొసైటీకి నోటీసులు ఇచ్చారు. కరోనా పరిస్థితుల్లో నుమాయిష్‌ను మూసేయాలని నగర సీపీ ఆనంద్ సొసైటీకి సూచించగా నిర్వహకులు 25వ తేదీ నుంచి దానిని నిలిపివేశారు. ఆ తర్వాత తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడడంతో మళ్లీ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.













