జనవరి 1 నుండి నుమాయిష్ ప్రారంభం
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రతి ఏటా నిర్వహించే పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన నుమాయిష్ జనవరి 1 నుండి ప్రారంభం కానుంది. కాగా ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15 వరకు జరగనుంది. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఈ 82వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో 2,400 స్టాళ్లు ఏర్పాటు చేశారు. వీటిలో విదేశీ సంస్థలకు చెందిన స్టాళ్లు కూడా ఉన్నాయి. నుమాయిష్ లో ఈసారి టికెట్ ధర పెంచారు. గతంలో రూ.30 ఉన్న టికెట్ ధర ఇప్పుడు రూ.40కి పెంచారు. ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారులకు ప్రవేశం ఉచితం అని నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్ కు వచ్చే వారి వాహనాలకు ఉచిత పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు.













