బి-1, బి-2 వీసాల కోసం ఇంటర్వ్యూలు
అమెరికా బి-1, బి-2 వీసాల కోసం ఇంటర్వ్యూలు వచ్చే సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం తెలిపింది. తొలిసారి టూరిస్టు బి-1, బి-2 వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు 2022 సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి. తొలిసారి బి-1, బి-2 వీసాల కోసం దరఖాస్తు చేసుక్ను వారిని మళ్లీ ఇంటర్వ్యూ చేస్తాం. ఇది రీ ఓపెన్ అయ్యే చివరి కేటగిరీగా ఉంటుంది. రాబోయే వారాల్లో వారి అపాయింట్మెంట్ల బుకింగ్‌ను ప్రారంభిస్తాం. ఇది చాలా వేగంగా సాగుతుంది. రోలింగ్ ప్రాతిపదికపై మరిన్ని అపాయింట్మెంట్లను కూడా చేరుస్తాం అని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ తెలిపింది.













