హైదరాబాద్ కేంద్రంగా వీసా స్కాం…

అమెరికాలో హెచ్-1బీ వీసాలకు సంబంధించి మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఇండియా లోని హైదరాబాద్ కేంద్రంగా హెచ్-1బీ వీసా స్కామ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. బెంచ్ అండ్ స్విచ్ తరహా మోసానికి టెక్ కంపెనీ పాల్పడిందని అధికారులు కనుగొన్నారు.. టెక్సాస్‍లోని హ్యూస్టన్ కోర్టులో నేరాన్ని క్లౌడ్ జెన్ కంపెనీ అంగీకరించింది. థర్డ్ పార్టీ కోసం పని ఉందంటూ భారత్ నుంచి ఉద్యోగులకు బోగస్ కాంట్రాక్టులు, హెచ్-1బీ వీసాల జారీ చేసినట్లు క్లౌడ్‍జెన్ కంపెనీ పేర్కొంది. ఉద్యోగుల నుంచి 2013 నుంచి 2020 వరకు కమీషన్లు రూపంలో 5 లక్షల డాలర్లను క్లౌడ్ జన్ వసూలు చేసింది. వర్జీనియా, రొమేనియా దేశాలతో పాటు హైదరాబాద్‍లోని గచ్చిబౌలిలో క్లౌడ్‍జెన్‍కు కార్యాలయాలు ఉన్నాయి.