అసెంబ్లీకి రాని కేసీఆర్… నల్గొండ సభకు వెళ్తారా? : భట్టి
కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చ చేపట్టి, తీర్మానం చేసి ఢిల్లీకి పంపుదామంటే, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ఆసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీకి రాని వ్యక్తి మంగళవారం నల్గొండ సభకు వెళ్తారా? అని ప్రశ్నించారు. ఈఎన్సీ మురళీధర్‌రావును బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మాట్లాడించిందని ఆరోపించారు. ఆయన రిటైరైనా పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిందన్నారు. అసెంబ్లీలో కృష్ణా జల్లాలపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఏజెంట్లు చాలా మంది ఉన్నారని, వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.













