టీఆర్ ఎస్ కు హైకోర్టులో ఊరట
టీఆర్ఎస్కు హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2వ తేదీన కొంగర కలాన్‌లో నిర్వహించే ప్రగతి నివేదన సభపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. సభకు అనుమతి ఇవ్వ వద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. కాగా, ఇప్పటికే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా సభ నిర్వహిస్తామంటూ అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సభ జరుపుకోవాలని సూచించారు. ఆ మేరకు ప్రభుత్వ అడ్వోకేట్ జనరల్ హామీ ఇవ్వడంతో హైకోర్టు, పిటిషన్‌కు కొట్టివేసింది.













