ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాలరావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. తన కార్యాలయంలో వేదపండితులు నిర్వహించిన పూజల అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్, ప్రజా సంబంధాల సలహాదారుగా బాధ్యతలను చేపట్టారు. హర్కఠ వేణుగోపాల్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ రావు, జీఏడీ కార్యదర్శి రఘునందన్‌రావు, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాసు మున్షీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, కాంగ్రెస్ నేతలు సుబ్బిరామిరెడ్డి, మధు యాష్కి గౌడ్ తదితరు ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు అభినందించారు.













