హుజూరాబాద్ ఫలితంపై.. మంత్రి హరీశ్‌రావు స్పందన
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ ఓటమిపాలైన నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేమీ తగ్గలేదన్నారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికతో కుంగిపోవదని, గెలిచినవాడు పొంగిపోలేదన్నారు. ఓడినా, గెలిచిన టీఆర్స్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పని చేస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హుజూరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేశాయని, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్లే చెబుతున్నారన్నారు. జాతీయస్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర స్థాయిలో కుమ్మక్కు కావడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు.













