యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మండలి చైర్మన్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతుకు ముందు ఆలయానికి వచ్చిన స్పీకర్‌కు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ ఊహించని విధంగా అభివృద్ధి చేస్తున్నారు. నిర్మాణంలో లోపాలు లేకుండా నిర్మించారన్నారు. భవిష్యత్ తరాలు కూడా కేసీఆర్‌ను గుర్తుంచుకునేలా ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టారన్నారు. సీఎం కేసీఆర్‌కు మరింత శక్తి ప్రసాదించాలని స్వామి వారిని ప్రార్థించానన్నారు. గోదావరి జలాలను యాదాద్రికి తీసుకొచ్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నారు.













