ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు ఘనంగా ఏర్పాట్లు
అమెరికా-భారత్‌ల సంయుక్తాధ్వర్యంలో వచ్చే నవంబరు 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ పారిశ్రామికవేత్తల (వ్యవస్థాపకులు) 2017 వార్షిక శిఖరాగ్ర సదస్సు నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. అమెరికా, భారత ప్రభుత్వాల సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఆతిథ్య కమిటీ(లోకల్ హోస్ట్కమిటీ)ని ఏర్పాటు చేసింది. దీనికి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ చైర్మన్‌గా, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కన్వీనర్‌గా ఉంటారు. ప్రభుత్వ సలహాదారు పాపారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, డీజీపీ అనురాగ్శర్మ్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సందీప్ శాండిల్య, మహేశ్ భగవత్ సభ్యులు. ఈ కమిటీ రెండుసార్లు సమావేశమైంది. సదస్సు నిర్వహణకు భారత నీతిఆయోగ్ కమిటీ, అమెరికా కాన్సుల్ జనరల్ ల అధ్వర్యంలో మరో రెండు ఉన్నతస్థాయి కమిటీలు ఏర్పాటయ్యాయి. వీటితో రాష్ట్ర ప్రభుత్వ కమిటీ సమన్వయంతో వ్యవహరిస్తుంది.













