నేను ఎవర్నీ తప్పుపట్టేందుకు ఉస్మానియాకు రాలేదు
ఉస్మానియా ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పరిశీలించారు. ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శశికళ గవర్నర్కు స్వాగతం పలికారు. అనంతరం ఆస్పత్రి పరిసరాలను, పాత భవనాన్ని గవర్నర్ పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ ఉస్మానియా ఆసుపత్రి విషయంలో చొరవ చూపిన కోర్టును అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలోని టాయిలెట్లు పరిశీలించా, పరిస్థితి దారుణంగా ఉంది. రోజుకు 2 వేల మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారు. ఆసుపత్రి పైకప్పు పెచ్చులు ఊడి రోగులు బాధపడుతున్నారు. రోజుకు 200 వరకు సర్జరీలు చేస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి భవనం కట్టి వందల ఏళ్లవుతోంది. జనరల్ వార్డులో కొన్ని ఫ్యాన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. ఎండ వేడి తట్టుకోలేకపోతున్నామని రోగులు వాపోతున్నారు. కొత్త భవనం కట్టాల్సిన అవసరం ఉంది. నేను ఎవరినీ తప్పుబట్టేందుకు ఉస్మానియా ఆసుపత్రికి రాలేదు అని అన్నారు.













