తెలంగాణ ప్రజలకు శుభవార్త.. త్వరలోనే
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. కైతలాపూర్ ప్లై ఓవర్ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు మంచినీటి సదుపాయం, రోడ్లు, కరెంటు, పార్కులు, వైకుంఠధామాలు బాగా చేసుకున్నామని తెలిపారు. బస్తీల్లో ఉండే పేదలకు సుస్తీ అయితే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. అన్నపూర్ల సెంటర్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇప్పుడు మన బస్తీ` మన బడి కార్యక్రమంలో పాఠశాలలు బాగు చేసుకుంటున్నామని, ఒక్కొక్కటిగా పనులు చేసుకుంటూ మందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి 57 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పామని, వెంటనే ఇవ్వాలని కోరారన్నారు. అతి త్వరలోనే పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రకటించారు.
కొత్త రేషన్‌కార్డులు, కొత్త పెన్షన్లు ఇస్తాం. అలాగే డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తామన్నారు. జీహెచ్ఎంసీ మేయర్, అధికారులతో సమావేశమై కార్యక్రమాన్ని మొదలు పెడుతామన్నారు. పారదర్శకంగా లాటరీ తీసి ఇండ్లు అందజేస్తామన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో 28 రాష్ట్రాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు అనే కార్యక్రమం లేదు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనూ లేదు. హైదరాబాద్‌లో కట్టిన ఇండ్లు రూ.30 నుంచి 50 లక్షల విలువ ఉంటుంది. అలాంటి ఇండ్లు ఉచితంగా ఇచ్చే సమయంలో ఆలోచించి పారదర్శకంగా జాగ్రత్తగా అర్హులకు అందజేస్తాం అని స్పష్టం చేశారు.













