హైదరాబాద్ లో జియుఎస్ తొలి కేంద్రం
ఐరోపాలోని అతిపెద్ద, అత్యంత సృజనాత్మక ఉన్నత విద్యారంగ సంస్థల్లో ఒకటైన గ్లోబల్ యూనివర్సిటీ సిస్టమ్స్ (జియుఎస్) భారత్‌లోకి ప్రవేశించింది. తొలి అడుగుగా హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో జియుఎస్ ఎడ్యుకేషన్ (ఇండియా) ఎల్‌ఎల్‌పిని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కే. తారక రామారావు చేతుల మీదుగా ఈ కార్యాలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఐటి కార్యదర్శి జయేష్ రంజన్, గ్లోబల్ యూనివర్సిటీ సిస్టమ్స్ వ్యవస్థాపకులు, సిఇఓ ఆరోన్ ఎటింగెన్ కూడా పాల్గొన్నారు. కంటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తమ సంస్థ అంతర్జాతీయ కార్యకలాపాలతో పాటు దేశంలోని విశ్వవిద్యాయాలు, కాలేజీల కోసం వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడం జియుఎస్ ఎడ్యుకేషన్ ఇండియా ఏర్పాటు ఉద్దేశమని జియుఎస్ వ్యవస్థాపకులు ఎటింగెన్ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే 120 మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు మున్ముందు మరింత మందిని నియమించుకునే ఆలోచన ఉందని జియుఎస్ ఎడ్యుకేషన్ ఇండియా ఎండి శశి జలిగామ తెలిపారు.













